బిగ్ బాస్ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చిన నటుడు విజయ్ సేతుపతి

రిపోర్టర్: రమేష్ స్థలం: చెన్నై

బిగ్ బాస్ తమిళ షోలో తాను చేసిన నాయకత్వం గురించిన వ్యాఖ్యలు కేవలం హౌస్‌లోని కంటెస్టెంట్లకు మాత్రమే వర్తిస్తాయని, బయటి వ్యక్తులకు లేదా రాజకీయ నాయకులకు సంబంధం లేదని ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడంతో షో ప్రోమో ద్వారా ఈ క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయ నాయకులను ఉద్దేశించి చేసినట్లు కొందరు భావించడంతో ఆయన ఈ వివరణ ఇస్తూ తమ అభిప్రాయాలు కేవలం హౌస్‌లోని ఆటకే పరిమితమని పునరుద్ఘాటించారు.