విమల్ పాన్ మసాలా ప్రకటన కేసులో బాలీవుడ్ నటుల విచారణ

రిపోర్టర్: గోపి స్థలం: ముంబై

విమల్ ఏలక్కీ ప్రకటనలో నటించిన షారూఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు జారీ చేసిన నోటీసులపై స్పందనలు అందాయని మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే వెల్లడించారు. నిషేధిత పాన్ మసాలా ఉత్పత్తులకు సర్రోగేట్ ప్రకటనలు చేస్తున్నారన్న ఆరోపణలపై నటులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇద్దరు నటులు కోరిన విచారణ ప్రక్రియ పూర్తయిందని, చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.