పేదలకు సొంతింటి భరోసా: ఇరవై ఒక్క నెలల్ లో లక్షా ఎనిమిది వేల టిడ్కో ఇళ్ల ప్రారంభం
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై ఒక్క నెలల వ్యవధిలోనే లక్షా ఎనిమిది వేల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గడిచిన వైకాపా పాలనలో పట్టణ పేదల సొంతింటి కల గాలికి కొట్టుకుపోయిందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది ఇళ్ల నిర్మాణాలు అటకెక్కాయని అధికారులు తెలిపారు. మౌలిక వసతులు కల్పించి అర్హులైన నిరుపేద కుటుంబాలకు పక్కా గృహాలను అందిస్తున్నామని సర్కార్ స్పష్టం చేసింది.