కౌన్ బనేగా కరోడ్ పతి షూటింగ్ లో జారిపడ్డ అమితాబ్ బచ్చన్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Mumbai
కౌన్ బనేగా కరోడ్ పతి షో షూటింగ్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ జారిపడి మోకాలికి స్వల్ప గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. గాయం తీవ్రమైనది కాదని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని తెలిపారు. కొద్దిరోజుల పాటు స్టేజ్ మీదకు రాలేనని, సీటు వద్ద నుంచే కంటెస్టెంట్లను ఆహ్వానిస్తానని అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు.