జీలుగుమిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి హైస్కూల్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ భారీ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు సుమారు ఇరవై మంది ప్రయాణికులకు తీవ్ర స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.