వినేష్ ఫోగట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతి కోరుతూ భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఒకరికి మాత్రమే మినహాయింపు ఇస్తే ఇతర అథ్లెట్లకు అన్యాయం చేసినట్లవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ప్రసవానంతరం పునరాగమనం చేసే మహిళా అథ్లెట్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని డబ్ల్యూఎఫ్‌ఐని ఆదేశించింది.