రెండేళ్లు సమయం ఇవ్వండి, సమస్యలు తీర్చకపోతే మీ ఇష్టం: రేవంత్

రిపోర్టర్: సతీష్ స్థలం: వికారాబాద్

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రెండేళ్ల సమయం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. టీచర్లు ధర్నాలకు దూరంగా ఉండి విద్యార్థులపై దృష్టి పెట్టాలని సూచించారు. తాను బడి దొంగను కాదని, మాట నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఒకవేళ సమస్యలు తీర్చకపోతే వచ్చే ఎన్నికల్లో తనకు సున్నా మార్కులు వేస్తారో, నూటికి నూరు వేస్తారో అది టీచర్ల నిర్ణయానికే వదిలేస్తున్నానని సవాల్ విసిరారు.