పిడుగుపాటు ముప్పు నుంచి రక్షణ కోసం దామిని యాప్ వాడుదాం

రిపోర్టర్: హరి స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో పిడుగుపాటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర భద్రతా విధానానికి శ్రీకారం చుట్టింది. రుతుపవనాలకు ముందు ఉరుములు, మెరుపులతో ప్రమాదాలు పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగుపాటు ముప్పును ముందే పసిగట్టి హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన దామిని యాప్‌ను చరవాణులలో డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు. ఈ యాప్ ద్వారా మూడు గంటల ముందే హెచ్చరికలు అంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.