నెన్నెలలో ఘనంగా ఎమ్మెల్యే వినోద్ జన్మదిన వేడుకలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని నెన్నెల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు బొమ్మెన హరీష్ గౌడ్ ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు కంపేల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డిసిసి కార్యదర్శి సుంకరి శ్రీనివాస్, ఎఎంసి డైరెక్టర్ చెన్నోజి శంకరయ్యతో పాటు సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జాడి రాజ్కుమార్, పలువురు సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.