కెనడాలో ప్రముఖ పంజాబీ గాయకుడు అమీ విర్క్ కాన్వాయ్‌పై కాల్పులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: World
కెనడాలోని అబ్బోట్స్‌ఫోర్డ్‌లో ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు అమీ విర్క్ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. కచేరీ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆయన కారుపై ఏడు నుంచి పదిసార్లు కాల్పులు జరిగాయి. అయితే ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్‌ప్రూఫ్ కారుపై తూటాలు దూసుకెళ్లినప్పటికీ, అమీ విర్క్‌తోపాటు అందులో ఉన్నవారంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.