ఆగ్రాలో షాకింగ్ ఘటన: భవనం పైనుంచి తోసేయడంతో వ్యక్తి మృతి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Agra

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పరిధిలోని రకాబ్ గంజ్ ప్రాంతంలో ఇద్దరు పోలీసులు భవనం పైనుంచి కిందకు తోసేయడంతో లలిత్ రాజ్ పుత్ అనే ముప్ఫై ఎనిమిదేళ్ల వ్యక్తి మృతి చెందాడని మృతుడి తండ్రి చందన్ రాజ్ పుత్ ఆరోపించారని పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో స్నేహితులతో కలిసి పేకాడుతుండగా ఈ దారుణం జరిగిందని, నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ రవీంద్ర కుమార్ వెల్లడించారు.