'ఆళ్ల నాని మృతి తీరని లోటు': ఎంపీ పుట్టా మహేష్ కుమార్
రిపోర్టర్: మహేష్
స్థలం: ఏలూరు
మాజీ డీసీఎం ఆళ్ల నాని అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, ఆయన మృతి ఏలూరు ప్రజలకు తీరని లోటని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. బుధవారం ఏలూరులోని ఆళ్ల నాని నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన.. వివాదరహిత నేతగా ఆళ్ల నాని చేసిన సేవలను కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, దేవుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.