ఇరాక్ నుంచి అమెరికా సైనిక దళాల పూర్తి ఉపసంహరణ

రిపోర్టర్: మహేష్ స్థలం: అమెరికా

ఇరాక్ నుంచి అమెరికా సైన్యం పూర్తిగా వైదొలగడాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. నరకంలోకి చేసిన అత్యంత ఖరీదైన విహారయాత్ర ఎట్టకేలకు ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన డెడ్లైన్ నాటికి ఉపసంహరణ ప్రక్రియ క్రమబద్ధంగా జరిగిందని వెల్లడించారు. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే అమెరికా ఈ ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. ఈ ప్రభావం ఎన్నో ఏళ్లుగా కొనసాగిందని ఆయన స్పష్టం చేశారు.