కియారా, సిద్ధార్థ్ విడాకుల ప్రచారంపై నెట్టింట తీవ్ర చర్చ
రిపోర్టర్: గోపి
స్థలం: Mumbai
బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య విభేదాలు వచ్చినట్లు, విడాకుల వరకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కియారా నటించిన 'టాక్సిక్' చిత్రంలోని బోల్డ్ సీన్ల వల్లే ఈ గొడవలు జరిగాయని కొందరు రూమర్లు సృష్టిస్తున్నారు. అయితే వీటిలో ఎలాంటి అధికారిక నిజం లేదని, ఇవన్నీ కేవలం నిరాధారమైన వదంతులేనని స్పష్టమవుతోంది.