అమెజాన్ కార్గో విమాన ప్రమాదంలో సంచలన నిజాలు వెలుగులోకి

రిపోర్టర్: హరి స్థలం: World

మయామి విమానాశ్రయంలో జరిగిన అమెజాన్ ప్రైమ్ ఎయిర్ బోయింగ్ 767 కార్గో విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక వివరాలను ఎన్టీఎస్బీ బయటపెట్టింది. ల్యాండింగ్ సమయంలో ఏడు ఆటోమేటిక్ హెచ్చరికలను పైలట్లు విస్మరించినట్లు కాక్‌పిట్ డేటా ద్వారా వెల్లడైంది. కేవలం నాలుగు సెకన్లలోనే విమానం 400 అడుగులు కిందకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు.