బంధానికి బ్రేకప్ చెబుతున్నట్లు ప్రకటించిన డిమాన్ పవన్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
బుల్లితెర నటి రీతూ చౌదరితో తన బంధానికి బ్రేకప్ చెబుతున్నట్లు డిమాన్ పవన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. తమ మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఇకపై కలిసి పని చేయబోమని ఆయన స్పష్టం చేశారు. నెటిజన్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలు, పుకార్లతో తాను తీవ్రంగా విసిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలు తలెత్తడంతో ప్రశాంతత కోసం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు డిమాన్ పవన్ పేర్కొన్నారు.