హైదరాబాద్‌లో గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక ప్రగతి కేంద్రాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో గిగ్ కార్మికులు, డెలివరీ బాయ్స్ సంక్షేమం కోసం 'ప్రాజెక్ట్ ప్రగతి' కింద జెప్టో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలో తొలుత ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసి, తాగునీరు, వాష్‌రూమ్‌లు, మొబైల్ ఛార్జింగ్, వైఫై, ఫస్ట్ ఎయిడ్ వంటి వసతులు ఉచితంగా అందించనున్నారు. ఈ కేంద్రాల నిర్వహణకు అవసరమైన పూర్తి నిధులను జెప్టో సంస్థ భరించనుంది.