తీవ్ర వాయుగుండం ప్రభావంతో నిలిచిపోయిన విమాన సర్వీసులు
రిపోర్టర్: గోపి
స్థలం: విశాఖపట్నం
తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రతికూల వాతావరణం, దృశ్యమాన్యత తగ్గడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన విమానాశ్రయాలలో విమాన రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. రన్‌వేలపై వర్షపు నీరు చేరడంతో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ప్రయాణికులు తమ విమాన సమయాలను ఎయిర్‌లైన్స్ సంస్థల ద్వారా ముందస్తుగా సరిచూసుకోవాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు విజ్ఞప్తి చేశారు.