కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక గర్భిణీల సేఫ్టీ వార్డు ప్రారంభం
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ కోరుకొండ పీహెచ్సీలో గర్భిణీల సౌకర్యార్థం సేఫ్టీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ప్రసవానికి ముందు నెల రోజుల ముందే గర్భిణీలను చేర్చుకుని మెరుగైన వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ఈ కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం తరఫున జనసేన నేతలు కొర్ర రంగారావు, పాంగి లింగారావుతో పాటు మాజీ సర్పంచ్ రమేష్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు.