పొదలకూరులో వైభవంగా శ్రీ పోలేరమ్మ తల్లి జాతర చాటింపు

రిపోర్టర్: కృష్ణ స్థలం: పొదలకూరు

శ్రీ పొదలకూరు గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతరలో భాగంగా మంగళవారం భక్తిశ్రద్ధలతో అమ్మవారి చాటింపు నిర్వహించారు. వెంకటగిరి సంప్రదాయాన్ని ఆదర్శంగా తీసుకుని 90 ఏళ్ల తర్వాత ఈ జాతరను నిర్వహిస్తుండటంతో మండల పెద్దలు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో ఘటోత్సవం, గ్రామోత్సవం జరగనున్నాయి.