విజయనగరం కలకలం: వైకాపా కార్పొరేటర్ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తుల బ్లేడు దాడి

రిపోర్టర్: రాము స్థలం: విజయనగరం

విజయనగరం నగరంలో వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి కోటమహంతి శ్రీనుపై గుర్తుతెలియని వ్యక్తులు బ్లేడుతో దాడి చేశారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు వ్యక్తులు ఆయనను అడ్డుకుని మెడపై దాడికి యత్నించారని బాధితుడు తెలిపారు. ఎడమ చేయి అడ్డుపెట్టడంతో భుజంపై గాయాలయ్యాయని, స్థానికులు వచ్చేసరికి నిందితులు పరారయ్యారని ఆయన పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ సీఐ టి.శ్రీనివాసరావు వెల్లడించారు.