రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు: నవంబర్ 1న పోలింగ్

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముగిసిందని, నవంబర్ 1న మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పురపాలక ఛైర్పర్సన్లు మరియు డివిజన్లు ఏకగ్రీవం అయినట్లు వెల్లడించారు. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, అధికారులకు తగు దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు.