అరకు పార్లమెంట్ టీడీపీ పరిశీలకుడిగా మజ్జి శ్రీనివాసరావు నియామకం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును టీడీపీ అధిష్టానం నియమించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఆయనకు తక్కువ వ్యవధిలోనే ఈ కీలక బాధ్యతలు దక్కడం ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.