రేవంత్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సతీష్ స్థలం: సిద్దిపేట

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర మోసానికి గురయ్యారని హరీష్ రావు ఆఫీస్ (Harish Rao Office) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, ఉద్యోగులు, రైతులు, వృద్ధులు మరియు రిటైర్డ్ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా మోసగించిందని ఆరోపించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి మోసపూరిత హామీలతో కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు.