హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ: అమెరికా అంగీకరిస్తే కేవలం రెండు రోజుల్ లో తెరుస్తామన్న ఇరాన్
రిపోర్టర్: వెంకట్
స్థలం: టెహ్రాన్
అమెరికా తమ ప్రధాన షరతులకు అంగీకరిస్తే కేవలం రెండు రోజుల్లోనే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. ఖతార్ ప్రతినిధులతో దోహాలో సాగుతున్న సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఆయన ఈ కీలక ప్రకటన చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వాషింగ్టన్ ఆంక్షల ఎత్తివేత, సైనిక బలగాల తగ్గింపుతో పాటు చమురు ఎగుమతి మినహాయింపులను పునరుద్ధరించాలని టెహ్రాన్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది.