ప్రముఖ డిజైన్ ప్లాట్ఫామ్ కాన్వాలో భారీ షాక్: వెయ్యి మందికి పైగా ఉద్యోగుల తొలగింపు
రిపోర్టర్: అశోక్
స్థలం: సిడ్నీ
ప్రముఖ డిజైన్ ప్లాట్ఫామ్ కాన్వాలో భారీగా ఉద్యోగుల కోత విధిస్తున్నట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు మరియు సీఈఓ మెలానీ పర్కిన్స్ వెల్లడించారు. గత పదమూడేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వృద్ధి మందగించడంతో, మొత్తం ఉద్యోగుల్ లో సుమారు ఇరవై రెండు శాతం మందిపై ప్రభావం పడనుందని తెలిపారు. ఇందులో కొందరు ఉద్యోగాలు కోల్పోగా, మరికొందరికి పాత్రలు మారుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.