పుణేలో రోడ్డు ప్రమాదం, ఐటీ ఇంజనీర్ మృతి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని పుణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ వాక్ వెళ్తున్న 48 ఏళ్ల ఐటీ ఇంజనీర్ వీరేంద్ర ద్వివేదిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 19 ఏళ్ల కారు డ్రైవర్ ఇಶಾನ್ సేథియాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.