రామాయణం సినిమా నుంచి సాయి పల్లవి సీత పాత్ర ప్రోమో విడుదల

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం సినిమా నుంచి నటి సాయి పల్లవి సీత పాత్రకు సంబంధించిన ప్రత్యేక ప్రోమోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసురుడిగా నటిస్తుండగా, నవంబర్ ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు.