గుంటూరులో సేఫ్ స్టే యాప్ మరియు డ్రోన్ పోర్టల్ ప్రారంభించిన డీజీపీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: గుంటూరు
సాంకేతికతతో ప్రజలకు పోలీసు సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో గుంటూరు పోలీసు కార్యాలయంలో సేఫ్ స్టే యాప్, ఏఐ ఆధారిత సెంట్రల్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్‌ను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని పీజీలు, హోటళ్లలో బస చేసే వారి వివరాలు రియల్‌టైంలో అందుబాటులోకి వస్తాయని, నేరాల నివారణకు సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వకుల్‌జిందాల్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.