పన్నెండు గంటల కస్టడీ పెరోల్ పై వచ్చి విదేశీయురాలని పెళ్లాడిన గ్యాంగ్ స్టర్

రిపోర్టర్: అశోక్ స్థలం: Haryana

జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ మైన్ పాల్ ధిల్లాకు కోర్టు మంజూరు చేసిన పన్నెండు గంటల కస్టడీ పెరోల్ కాలంలో విదేశీ ప్రియురాలను వివాహం చేసుకున్నట్లు హరియాణా పోలీసులు తెలిపారు. హత్య, దోపిడీ వంటి ఇరవై రెండు కేసుల్లో దోషిగా తేలిన ఇతడు, గతంలో పెరోల్ నిబంధనలు ఉల్లంఘించి కంబోడియాకు పరారయ్యాడు. ఇంటర్ పోల్ సహాయంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి భారత్ కు రప్పించగా, వివాహం నిమిత్తం న్యాయస్థానం ఈ స్వల్పకాలిక పెరోల్ మంజూరు చేసింది.