జయపురంలో ఘోర రోడ్డు ప్రమాదం స్కూటర్ ఆర్వరు మృతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: జైపూర్

రాజస్థాన్ లోని జైపూర్ లో శనివారం వేగంగా వచ్చిన మహీంద్రా థార్ వాహనం ఢీకొనడంతో నవల్ శర్మ అనే 57 ఏళ్ల స్కూటర్ రైడర్ ప్రాణాలు కోల్పోయాడు. సంగనేర్ ప్రాంతానికి చెందిన నవల్ శర్మ ఉదయం పని నిమిత్తం స్కూటర్ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన థార్ వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ టేజ్ ఆధారంగా పరారీలో ఉన్న వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.