డీఎస్సీ నియామకాల్లో భారీ స్కాం జరిగింది: వైఎస్ జగన్
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
డీఎస్సీ నియామకాల్లో భారీ స్కాం జరిగిందని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఈడిగ ప్రభాకర్‌కు టెట్‌లో అర్హత లేకపోయినా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఉద్యోగానికి అతను అనర్హుడని డీఈవో ధ్రువీకరించినా పోస్ట్ కేటాయించడంపై విమర్శలు గుప్పించారు. ఇదేనా కూటమి ప్రభుత్వ ఏడు దశల సర్టిఫికెట్ వెరిఫికేషన్ అని నిలదీశారు.