అర్నబ్ తుపాను ప్రభావం: జోలాపుట్ జలాశయం నీటి నిల్వలు ప్రమాద స్థాయికి చేరిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
అర్నబ్ తుపాను కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జోలాపుట్ జలాశయం నీటి నిల్వలు ప్రమాద స్థాయికి చేరుకున్నట్లు మాచ్‌ఖండ్ జల విద్యుత్తు కేంద్రం అధికారులు వెల్లడించారు. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్పిల్‌వే గేట్లు ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వరద ఉధృతి పెరగడంతో ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.