పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ జగదీష్ ఆదహళ్లి

రిపోర్టర్: హరి స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా శ్రీ జగదీష్ ఆదహళ్లి అధికారికంగా బాధ్యతలు స్వీకరించినట్లు Palnadu Police వెల్లడించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎస్పీ జగదీష్ ఆదహళ్లి పేర్కొన్నట్లు పాలనాడు పోలీస్ శాఖ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అధికారికంగా తెలియజేసింది.