ఘనంగా 'ఐ బొమ్మ' సినిమా ట్రైలర్ లాంచ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

విజయ్ రఘునాథభట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐ బొమ్మ' సినిమా ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. బానోత్ పవన్, గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కురువ జమన్న నిర్మించారు. ఒక్క రాత్రిలో స్క్రిప్ట్ పూర్తి చేసి, కేవలం పదిహేను రోజుల్లో షూటింగ్ ముగించినట్లు దర్శకుడు తెలిపారు. త్వరలోనే ఈ ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.