సంగ్రూర్ ఘటనపై కాంగ్రెస్ బీజేపీ అకాలీదళ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అమన్ అరోరా మండిపాటు

రిపోర్టర్: వెంకట్ స్థలం: పంజాబ్

సంగ్రూర్ జిల్లాలో అమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని పంజాబ్ కేబినెట్ మంత్రి అమన్ అరోరా తీవ్రంగా ఆరోపించారు. నామోల్ గ్రామానికి చెందిన జగ్షీర్ సింగ్ అలియాస్ జగ్గా వివాదంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అతనిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎస్ఎస్పీ రవ్జోత్ గ్రేవాల్ తో కలిసి ఆయన స్పష్టం చేశారు.