పురుషోత్తపురంలో పోటెత్తిన ఓటర్లతో సజావుగా సాగుతున్న పోలింగ్

రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సుమారు యాభై శాతం ఓటింగ్ నమోదు ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలింగ్ సజావుగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.