సదాశివపేటలో ఏసీబీ దాడులు: లంచం తీసుకుంటూ పట్టుబడిన వ్యవసాయ అధికారి
రిపోర్టర్: సునీల్
స్థలం: సదాశివపేట
సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారని డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఎరువుల వ్యాపారం సాగేందుకు రూ. 30 వేలు డిమాండ్ చేయగా, మొదటి విడతగా రూ. 10 వేలు తీసుకున్నారని పేర్కొన్నారు. కార్యాలయంలో మిగతా రూ. 20 వేలు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్ లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు వెల్లడించారు.