'జగదీష్ రెడ్డి పరామర్శ': నిమ్స్ ఆసుపత్రిలో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు

రిపోర్టర్: విజయ్ స్థలం: Hyderabad

అసెంబ్లీ వద్ద జరిగిన తోపులాటలో అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.