రోడ్లపై ఇనుప మేకులు: ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులపై గ్రామస్థుల నిరసన
రిపోర్టర్: విజయ్
స్థలం: మెదక్
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రాగాయపల్లిలో ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమకు వెళ్లే స్క్రాప్ లారీ ల నుండి రోడ్డుపై ఇనుప మేకులు పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై పడుతున్న ఇనుప సామాగ్రి కారణంగా టైర్లు పగిలి కిలోమీటర్ల మేర నడుపుకుంటూ వెళ్లాల్సి వస్తోందని, పరిశ్రమల వల్ల తీవ్ర కాలుష్యం వెలువడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వారు మండిపడ్డారు.