'కాంగ్రెస్‌లో చేరిక': మంత్రి పొంగులేటి సమక్షంలో సీపీఎం నేత తుమ్మల సురేష్ గూటికి!

రిపోర్టర్: సురేష్ స్థలం: ఖమ్మం

ఖమ్మం రూరల్ మండలం ఎం.వి.పాలెం గ్రామ మాజీ సర్పంచ్, సీపీఎం నాయకుడు తుమ్మల సురేష్ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆయనను పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తుమ్మల సురేష్‌తో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.