వివేక్ తివారీ హత్య కేసులో పోలీసు అధికారి సందీప్ కుమార్ నిర్దోషి
రిపోర్టర్: హరి
స్థలం: లక్నో
లక్నోలో సంచలనం సృష్టించిన ఆపిల్ ఎగ్జిక్యూటివ్ వివేక్ తివారీ హత్య కేసుకు సంబంధించి నిందితుడైన పోలీసు అధికారి సందీప్ కుమార్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ప్రధాన సాక్షి సనా సిద్ధిఖీ వాంగ్మూలంలో వ్యత్యాసాలు మరియు వైద్య పరీక్షల నివేదికల్లోని పొంతన లేకపోవడంతో పాటు ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 29, 2018 న వివేక్ తివారీని కారు ఆపలేదనే నెపంతో పోలీసులు కాల్చి చంపిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.