యూట్యూబర్ రావణ్ రిమాండ్ ఈ నెల 22 వరకు పొడిగింపు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
సంచలనాత్మక యూఏపీఏ కేసులో అరెస్టైన ప్రముఖ యూట్యూబర్ బచ్చలకూరి రావణ్‌కు గన్నవరం కోర్టులో చుక్కెదురైంది. విచారణ నిమిత్తం హాజరుపరిచిన పోలీసులు, కోర్టు రావణ్ రిమాండ్‌ను ఈ నెల 22వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ వ్యతిరేక, మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేస్తూ సాయుధ తిరుగుబాట్లను ప్రేరేపించే వీడియోలు అప్‌లోడ్ చేసినట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.