ఆసియా గేమ్స్ కోసం 702 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
రిపోర్టర్: రమేష్
స్థలం: India
ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటేలా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లలో 702 కోట్లు ఖర్చు చేసింది. అంతర్జాతీయ శిక్షణ, నాణ్యమైన కోచింగ్ కోసం ఈ నిధులను వెచ్చించారు. జపాన్ వేదికగా జరిగే ఈ టోర్నీలో 501 మంది భారత అథ్లెట్లు బరిలోకి దిగుతుండగా, వీరిలో 300 మందికి పైగా తొలిసారిగా ఆడుతున్నారు. ఈసారి పతకాల పంట పండుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.