ఆంధ్రప్రదేశ్ లో నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 659 జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాల కోసం నిర్వహించే ఈ ఎన్నికల్ లో సుమారు రెండు కోట్ల ఎప్ పై ఒక్క లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు.