హెచ్-1బి వీసా నిబంధనల్లో భారీ మార్పులు చేయనున్న ట్రంప్ ప్రభుత్వం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Washington
అమెరికాలో వీసా మోసాలను అరికట్టేందుకు రానున్న రోజుల్లో హెచ్-1బి వీసా జారీలో సమూల మార్పులు చేయనున్నట్లు కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పోసిటో స్పష్టం చేశారు. విదేశీ కార్మికుల అక్రమ ప్రవేశాలు, శ్రమ దోపిడీ ఆరోపణలపై దేశవ్యాప్తంగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. క్రిమినల్ దర్యాప్తు పూర్తయ్యే వరకు కాగ్నిజెంట్, క్లౌడెరా సంస్థల వీసా దరఖాస్తులను నిలిపివేసినట్లు వెల్లడించారు. స్థానిక కార్మికుల తొలగింపు చర్యలపై వైట్ హౌస్ కఠిన నిబంధనలు తెచ్చింది.