హైవేపై ఘోరం: నాటుసారా లారీ కిందపడి పోలీస్ ఇన్ స్పెక్టర్ దుర్మరణం
రిపోర్టర్: అశోక్
స్థలం: దేవాస్
మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో హైవేపై తనిఖీలు నిర్వహిస్తున్న ఖాటేగావ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ దిలీప్ పురిని అక్రమ మద్యం తరలిస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మృతుడి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని, ఆయన భార్యకు సబ్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.