రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు: భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
రిపోర్టర్: రాము
స్థలం: విజయవాడ
రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని వివిధ ఆలయాల అర్చకులు తెలిపారు. ప్రముఖ శైవ, శక్తిపీఠాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆలపాటి గిరిధర్ దర్శించుకున్నారు. అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో అమ్మవారికి అర్చకులు నూటఎనిమిది కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నగరోత్సవం కన్నులపండువగా సాగింది. కోనసీమ జిల్లాలో కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.