తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పలు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీలోని తొమ్మిది, తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్నం-గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో, ఆకస్మిక వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.