పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కాకినాడ
సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఉప్పాడ, కొత్తపల్లి, పిఠాపురం గ్రామీణ మండలాల ప్రజల కోసం రూ.9.59 కోట్లతో పునరుద్ధరించిన నాగులాపల్లి రక్షిత తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.307 కోట్ల జల్‌జీవన్ నిధులతో మల్టీ విలేజీ స్కీమ్, రూ.200 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.323 కోట్లతో ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడతో పాటు పలు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా మత్స్యకారులకు భద్రతా పరికరాలు, మహిళా సంఘాలకు భారీగా రుణాలు పంపిణీ చేయనున్నారు.